'సీఎం రేవంత్ రెడ్డికి బీసీలంటే చిన్న చూపు'

KMM: సీఎం రేవంత్ రెడ్డికి బీసీలంటే ఎందుకంత చిన్న చూపు అని వైరా నియోజకవర్గ BRS పార్టీ నాయకులు గిరిబాబు అన్నారు. సీట్ల కోసం, ఓట్ల కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని సోమవారం ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీసీ రిజర్వేషన్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.