బైక్‌ను ఢీకొన్న లారీ వ్యక్తికి తీవ్ర గాయాలు

బైక్‌ను ఢీకొన్న లారీ వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: ఖిల్లా వరంగల్ మండలం నక్కలపల్లి తౌడు ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. లారీని బైకు ఢీకొన్న ఘటనలో సంగెం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన ఉడుతబోయిన నాగరాజు (30)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.