మోదీతో కెనడా ప్రధాని భేటీ

మోదీతో కెనడా ప్రధాని భేటీ

భారత్ పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ హౌస్‌‌లో ఇరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రక్షణ, సాంకేతిక రంగాలతో పాటు పలు కీలక విభాగాల్లో ఒప్పందాలపై ముచ్చటించారు. అలాగే మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ వాతావరణంపై కూడా ఇరు నేతలు కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది.