నూతన సర్పంచ్‌ను సన్మానించిన కాంగ్రెస్ నేతలు
KMM: నెలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వేణు 232 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. రాయిగూడెం గ్రామపంచాయతీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువనేత కల్తీ వెంకట్ పాల్గొని నూతన సర్పంచ్‌ను శాలువాతో సన్మానించారు.