VIDEO: ప్రకాశం బ్యారేజీకు కొనసాగుతున్న వరద

NTR: ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయానికి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి రావడంతో అధికారులు 70 గేట్లను ఎత్తి 4.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 12.9 అడుగుల నీటిమట్టం నమోదైంది. నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.