VIDEO: బోథ్‌లో ఘనంగా విజయ్ దివాస్ వేడుకలు
ADB: బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయ్ దివాస్ వేడుకలను MLA అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ CM కేసీఆర్ 11 రోజుల దీక్షకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు.