ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన కార్యక్రమం

NLR: అల్లూరు మండలంలోని పురిణి కొత్తపాలెం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం,తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గురువారం వేకువజామున విశేష పుష్పాలంకరణ మంగళ వాయిద్యాలతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గ్రామోత్సవం ఘనంగా సాగింది.