'ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

ELR: ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో గురువారం మహిళా భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై పోలీసులు విద్యార్థులకి విస్తృతమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్ బ్యాడ్ టచింగ్, హింస, వేధింపులు వంటి వాటిపై అవగాహన కల్పించారు. అలాగే ఆన్‌లైన్ మోసాలను వివరించారు.