VSU విద్యార్థినికి డాక్టరేట్ ప్రదానం

NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధనా విద్యార్థిని ఎం.జయ హర్షకు అధికారులు డాక్టరేట్ ప్రదానం చేశారు. నగరంలోని ఓల్డ్ మిలిటరీ కాలనీకి చెందిన ఆమె తూర్పు తీర ప్రాంతంలోని సముద్ర జల జీవాలలో ఒక ముఖ్యమైన జాతీ లుట్టానిడ్స్‌పై చేసిన పరిశోధనలకు గాను పట్టాను అందించారు. పలువురు ఆమెను అభింనదించారు.