విద్యార్థుల విద్యాభివృద్ధికి టీచర్స్,పేరెంట్స్ సమావేశాలు
ప్రకాశం: హనుమంతునిపాడు(M) హాజీపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ క్లస్టర్ ఇంఛార్జి గాయం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలతో పాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఇటువంటి సమావేశాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.