రేపు జీడీ నెల్లూరులో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటన

CTR: ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జీడీ నెల్లూరు మండలంలో గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. మండలంలోని కొత్త వేల్కూరు వద్ద ఉదయం 10:30 గంటలకు ఆర్‌వో ప్లాంట్ ప్రారంభిస్తారు. అనంతరం 12:30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో హౌసింగ్ లేఅవుట్‌ల లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ, మధ్యాహ్నం 3 గంటలకు ZPHS పాఠశాలలో భవనా నిర్మాణంలో పాల్గొంటారు.