స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
TPT: నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్, కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లడుతూ.. తూకివాకం వద్ద నిర్మిస్తున్న 6 మెగావాట్ సోలార్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు.