'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

WNP: ఆత్మకూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని మున్సిపల్ కమిషనర్ శశిధర్ హెచ్చరించారు. శనివారం 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పలు షాపులను తనిఖీ చేసిన ఆయన, నిబంధనలు అతిక్రమిస్తే భారీగా అపరాధ రుసుము విధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ నాగమణి రాజేశ్, వైస్ ఛైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు.