'ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
WGL: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మీ- రామానంద్‌లు సూచించారు. 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యచరణలో భాగంగా పట్టణ పరిధిలోని 5వ వార్డు మహిళలకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంపై అవగాహన కల్పించారు. పట్టణప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు.