ఎర్రన్నాయుడు 13వ వర్థంతి
W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 13వ వర్థంతి సందర్భంగా టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీకి అచంచలమైన అంకితభావం, ప్రజల పట్ల అపారమైన ప్రేమతో సేవచేసిన ఎర్రన్నాయుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ఆదర్శప్రాయుడన్నారు. ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం మనందరి బాధ్యత అన్నారు.