ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..!

ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..!

అన్నమయ్య: బి.కొత్తకోట నుంచి చలిమామిడికి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం ప్రమాదానికి గురై బోల్తా పడింది. బి.కొత్తకోట పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే సమయంలో బస్సు నియంత్రణ తప్పి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.