ఆగస్టు 1న ఉద్యాన పంటలపై శిక్షణ

MHBD: ఐసీఏఆర్-ఐఐఎన్ఆర్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న మల్యాల, మహబూబాబాద్‌లో 150 మంది షెడ్యూల్డ్ కులాల రైతులకు ఉద్యాన పంటలపై శిక్షణ, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చ, ఉచిత పండ్ల మొక్కల పంపిణీ జరగనుంది. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ వచ్చి ముందుగా వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. హాజరైన వారికి మాత్రమే మొక్కలు పంపిణీ చేస్తారన్నారు.