VIDEO: ఈనెల 13న గుంటూరులో మెగా జాబ్ మేళా
GNTR: గుంటూరు హిందూ ఫార్మసీ కళాశాలలో ఈ నెల 13న జరగనున్న మెగా జాబ్ మేళాకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీశ్ శర్మ తెలిపారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ..ఈ మేళాకు మూడు వేల మందికిపైగా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. ఈ మేళా ద్వారా 1500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.