తెలంగాణ మలిదశ తొలి అమరుడు కిష్టయ్యకు ఘన నివాళులు
GDWL: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గద్వాల పట్టణ కేంద్రంలోని రాజీవ్ సర్కిల్, పాత బస్టాండ్ వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో కిష్టయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు.