ఉచిత న్యాయ సేవల కోసం మొబైల్ వ్యాన్ ప్రారంభం
WNP: మారుమూల ప్రాంతాలకు గ్రామ గ్రామానికి న్యాయ సేవ విస్తరించాలనే ఉదేశ్యంతో న్యాయ సేవ అధికార సంస్థ రెండు మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించినట్లు వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఛైర్మన్ రజిని తెలిపారు. ఈ మొబైల్ వ్యాన్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి ఉచిత న్యాయసేవలు, ఎలా అందజేయడం జరుగుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.