కార్యకర్తల కృషితోనే భారీ విజయాలు: ఎమ్మెల్సీ
GDWL: నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఘనవిజయం సాధించడంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పుల్లూరులో సునీత, బోరవెల్లిలో హరిచంద్రరెడ్డి సహా పలు గ్రామాల విజేతలను గురువారం ఆయన అభినందించారు. కార్యకర్తల కష్టం మరువలేనిదని, కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకం ఈ ఫలితాలతో నిరూపితమైందని కొనియాడారు.