నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BDK : కొత్తగూడెం సౌత్ సెక్షన్ పరిధిలోని రామవరం 33/11కేవీ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ హేమచంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్‌కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్నందున బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామవరం మున్సిపాలిటీ, ప్రశాంతి నగర్ పంచా యతీ, పరిధిలో విద్యుత్‌లో అంతరాయం ఉంటుందన్నారు.