VIDEO: ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై వీడియో రిలీజ్
RR: చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై వీడియో రిలీజ్ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్నానని, త్వరలోనే అందరి ముందుకు వస్తానన్నారు. ప్రధానమంత్రి మోదీ తనకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగారన్నారు. వైద్యులు చెప్పిన ప్రతి మాటను పాటించాలని మోదీ చెప్పారన్నారు. తనకు మంచి జరగాలని కోరుకున్న అందరికీ, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.