VIDEO: 'దావత్-ఏ-ఇఫ్తార్' వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ జిల్లా కేంద్రంలోని మదీనా మసీదు వద్ద ముస్లిం సోదరులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ‘దావత్-ఏ-ఇఫ్తార్’ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గంగా జమున తెహజీబ్‌కు నిలయమైన నల్గొండలో అందరం సోదరభావంతో మెలిగి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిని స్పష్టం చేశారు.