రేపటి నుంచి 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
VZM : 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి జిల్లా గ్రంధాలయ గౌరవ అధ్యక్షులు నాలుగెస్సుల రాజు నివాసంలో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వ తేదీ వరకు జరుపనున్నట్లు వారు తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్నదే తమ లక్ష్యం అన్నారు. వ్యవస్థాపకులు రవూఫ్,కొత్తలి ఎర్నాయుడు, దయానంద్, రత్నాల బాలకృష్ణ పాల్గొన్నారు.