కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. తస్మాత్ జాగ్రత్త

KDP: కలెక్టర్ పేరు మీద నకిలీ నంబర్‌తో వాట్సప్ ఖాతాను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు నమ్మవద్దని కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి కలెక్టర్ పేరుతో వాట్సప్ ఖాతాను క్రియేట్ చేసినట్లు తమ కార్యాలయ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఖాతా కలెక్టర్‌ది కాదని సృష్టం చేశారు. అధికారులు, ప్రజలు ఏప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.