రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

GNTR: ఫిరంగిపురంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వయస్సు 40 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని పోలీసులు తెలిపారు.