ఆడపిల్లల చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

ఆడపిల్లల చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

SRPT: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష వీడాలని జిల్లా కో- ఆర్డినేటర్ చైతన్య పిలుపునిచ్చారు. సోమవారం జాజిరెడ్డి గూడెం మండలం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘బేటీ బచావో - బేటీ పడావో’పై అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలను అరికట్టి, బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం అందరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం స్వర్ణలత పాల్గొన్నారు.