విజయవాడ బస్టాండ్‌లో భక్తుల రద్దీ

విజయవాడ బస్టాండ్‌లో భక్తుల రద్దీ

ఎన్టీఆర్: మహాశివరాత్రి ముగియడంతో విజయవాడ బస్‌స్టాండ్‌లో ప్రయాణికుల తాకిడి పెరిగింది. వివిధ శైవక్షేత్రాల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు సోమవారం తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం కావడంతో రద్దీ నెలకొంది. బస్టాండ్‌లోని ప్లాట్‌ఫారమ్‌లు, వెయిటింగ్ హాళ్లు భక్తులతో నిండిపోయాయి. కూర్చోవడానికి సీట్లు లేక చాలా మంది నిల్చొని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.