11వ వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభం
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాలమేరకు 11వ వార్డులో టకారీ పాలెంలో మున్సిపల్ సిబ్బంది కొత్తగా డ్రైనేజ్ పనులను శనివారం ప్రారంభించారు. 11వ వార్డులో సైడ్ కాలంలో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సహకారంతో పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ అన్నారు.