ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత
WGL: భారత పత్తి సంస్థ (CCI) జిన్నింగ్ మిల్లులపై విధించిన నిబంధనలు సడలించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా CCI, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను ఈ నెల 17 నుంచి పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు ఎవరూ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు ఆదివారం తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.