VIDEO: జోగులాంబ ఆలయ శుద్ధి
GDWL: సంపూర్ణ చంద్రగ్రహణం ముగియడంతో బుధవారం ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచే ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, స్వామి అమ్మవార్ల గర్భాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఉదయం 9 గంటల నుండి నిత్య పూజలు ప్రారంభమవ్వడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.