చిన్నారుల ఆరోగ్యం పూర్తిగా సురక్షితం
NDL: పాములపాడు మండలం అంగన్వాడీ కేంద్రంలో అస్వస్థతకు గురైన 8 మంది చిన్నారులకు తక్షణ వైద్య సేవలు అందించామని కలెక్టర్ రాజకుమారి గురువారం తెలిపారు. పిల్లల ఆరోగ్యం పూర్తిగా స్థిరపడడంతో వారిని ఇళ్లకు పంపినట్లు చెప్పారు. అంగన్వాడీకి సరఫరా చేసే ఆహార పదార్థాల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టులు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు.