ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా

SKLM: జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసికందును తొడలో సూది ఉండి పోయిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించకుండా నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.