మచిలీపట్నంలో జాతీయ లోక్ అదాలత్

మచిలీపట్నంలో  జాతీయ లోక్ అదాలత్

కృష్ణా: మచిలీపట్నంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 20 వేల రాజీకి అనుకూలమైన కేసులను 42 బెంచీల ద్వారా పరిష్కరిస్తున్నామని, రాజీ మార్గంలో ఇరు పక్షాలు గెలిచినట్లేనని చెప్పారు.