ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

MDK: చిలిపిచేడ్ మండలం చిట్కులలో అశోక్ (30) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరి వేసుకున్న సమయంలో కొనఊపిరితో ఉన్న అశోకు గమనించిన స్థానికులు వెంటనే జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.