VIDEO: యుటిఎఫ్ కౌన్సిల్ సమావేశాలకు ఆహ్వానం
SKLM: జిల్లా యుటిఎఫ్ కౌన్సిల్ సమావేశాలకు ఆహ్వానం పలుకుతూ ఎంఈవోలకు పత్రికలను అందజేయడం జరుగుతుందని జిల్లా గౌరవ అధ్యక్షులు కోరాడ వైకుంఠ రావు తెలిపారు. ఇవాళ నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఆహ్వాన పత్రికను ఎంఈవో ఉప్పాడ శాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈనెల ఏడవ తేదీన మెలియాపుట్టి మండలం చాపర జడ్పీ పాఠశాలలో సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.