జాగ్రత్త.. ఆ గ్రామాల్లో పులి సంచారం!
ASF: కాగజ్ నగర్ మండలంలోని మాండ్వా, గన్నారం, ఆరెగూడ, మోసం గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తం చేశారు. ప్రజలు అడవిలోకి, పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.