అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం

అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం

SRD: సిర్గాపూర్ మండలం చీమలపాడు అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం బాలల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీచర్ సావిత్రి ఆధ్వర్యంలో చాచా నెహ్రూ చిత్రపటానికి గులాబీ పూలు సమర్పించి నివాళి అర్పించారు. అనంతరం ఆమె పిల్లలకు ఆటపాటలు నిర్వహించి సంబరాలను జరిపారు. ఈ మేరకు పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారు.