జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
W.G: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీఎం ఆదేశాల మేరకు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలతో కూడిన ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులకు తగిన పరిష్కారం చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.