VIDEO: భారీ వర్షాలు.. గ్రామస్తులకు అప్రమత్తత సూచన

MLG: తాడ్వాయి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దామెరవాయి గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాగులు, వంకలు దాటవద్దని, చాపల వేటకు వెళ్లవద్దని సూచించారు. శిధిలావస్థలోని ఇళ్లలో ఉండకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రచారం చేస్తున్నారు.