కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

TPT: చంద్రగిరి మండలం ఏ. రంగంపేట దగ్గర గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. చంద్రగిరి పట్టణంలోని ఆర్ఎఫ్ రోడ్డుకు చెందిన సురేశ్ (36) రోడ్డు దాటుతుండగా తిరుపతి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్ అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.