గణపురంలో మిషన్ భగీరథ కార్మికుల ధర్నా

BHPL: గణపురం మండలంలో మిషన్ భగీరథ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ధర్నా చేపట్టారు. ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, సకాలంలో జీతాలు, ప్రమాద బీమా, ఇంక్రిమెంట్లు, సెలవులు, ఐడీ కార్డులు, జీతం పెంపు కోరుతూ నీటి సరఫరా నిలిపివేశారు. ఈ ధర్నాకు తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ ఇంఛార్జ్ రవి పటేల్ మద్దతు తెలిపారు.