మున్నేరు వరద ఉధృతిని పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్ మున్నేరు ప్రాంతాలను ఇవాళ మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలెవరు రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు.