'శుభవార్త.. సదరం స్లాట్స్ బుకింగ్ పున:ప్రారంభం'
సత్యసాయి: సదరం స్లాట్‌ల బుకింగ్ పున:ప్రారంభమైనట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రతి ఆసుపత్రిలో ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయో అధికారికంగా జాబితా విడుదల చేశామన్నారు. గతంలో బుకింగ్ చేసి వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అందుకే వీలైనంత త్వరగా అవసరమైన వారు గ్రామ లేదా సచివాలయాల్లో అప్లికేషన్ పూర్తి చేయాలని సూచించారు.