సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నెల్లూరులోని సబ్ యూనిట్ ఆఫీసర్లతో జిల్లా మలేరియా అధికారిణి హుసేన్నమ్మ నెలవారి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, చికెన్‌గునియా, మలేరియా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన నివారణ చర్యలను ఆమె అధికారులకు వివరించారు. కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం విధిగా డ్రైడేను నిర్వహించాలని తెలిపారు.