అయోధ్య రామయ్యను తాకిన సూర్యకిరణాలు

అయోధ్య రామయ్యను తాకిన సూర్యకిరణాలు

యూపీలోని అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా మ.12 గంటలకు రామ్ లల్లా నుదుటిపై సూర్యకిరణాలు పడ్డాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు రామాలయానికి పొటెత్తారు. దీన్ని కళ్లారా వీక్షించిన వారంతా భక్తపారవశ్యంతో.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సూర్యతిలకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.