VIDEO: అకాల వర్షం.. అన్నదాతకు నష్టం

TG: అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో వడ్లు కొట్టుకుపోయాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ములుగు(D) ఏటూరునాగారం(M) గోగుబెల్లి గ్రామంలో వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అమ్మకానికి తెచ్చిన ధాన్యం, బస్తాలు కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సమయానికి కొనుగోలు చేసుంటే ఈ నష్టం జరిగేది కాదని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.