ప్రజలు అపోహలు నమ్మొద్దు: సీఐ
NDL: పెట్రోల్, డీజిల్ కొరతపై వచ్చే అపోహలను నమ్మవద్దని ఇవాళ కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు సూచించారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కలెక్టర్, ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు నమ్మి బంకుల వద్దకు పరుగులు తీయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.