'గ్రామాల్లో మత్తుపదార్థాల విక్రయాన్ని అరికట్టాలి'
MNCL: కాసిపేట మండలంలోని గ్రామాల్లో మద్యం, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాన్ని అరికట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ఆయన మండలంలోని కోమటిచేను గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మత్తుకు యువత బానిసలై తమ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.